Top 16 Low Credit Score Loan Apps in India: Quick & Easy Approval | అత్యవసర పరిస్థితుల్లో సులభంగా లోన్‌లను అందించే 16 ఉత్తమ లోన్ యాప్‌ లు

Written by GNL Money

Updated on:

సాధారణంగా మనదేశం లో బ్యాంకు లు ఎవరికైనా లోన్ ఇవ్వాలంటే , వారి క్రెడిట్ స్కోర్ సిబిల్ స్కోర్ బాగుంటేనే లోన్స్ ఇస్తాయి. తక్కువ క్రెడిట్ స్కోర్‌ (Low Credit Score) ఉంటే, బ్యాంకు ల నుండి లోన్ పొందడం చాలా కష్టం. మీకు తక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే, తక్కువ వడ్డీ రేట్లకు లోన్స్ పొందడం కష్టం. అయితే, ఈ మధ్యనే అనేక లోన్ యాప్‌లు తక్షణ మరియు సులభమైన షరతులతో లోన్స్ అందిస్తున్నాయి. ఈ యాప్‌లు ముఖ్యంగా క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నవారికి లోన్స్ ఇస్తున్నాయి. మీకు తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నప్పటికీ, అత్యవసర పరిస్థితుల్లో సులభంగా లోన్‌లను అందించే 16 ఉత్తమ లోన్ యాప్‌ల (Top 16 Low Credit Score Loan Apps in India) కోసం దిగువ జాబితాను చూడండి.

Telegram Join Now
WhatsApp Join Now

Table of Contents

Top 16 Low Credit Score Loan Apps in India

1. ఫైబ్ (Fibe):

ఫైబ్ (Fibe – మునుపటి పేరు ఎర్లీసాలరీ – EarlySalary) అనేది ఎక్కువ మంది ఉపయోగించే లోన్ యాప్. ఇది మన క్రెడిట్ స్కోర్‌కు బదులుగా ఉద్యోగ స్థిరత్వం ఆధారంగా మనకున్న క్రెడిట్ అర్హతను అంచనా వేస్తుంది. తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి కూడా త్వరితగతిన అనుమతి మరియు తక్షణమే నిధులను మన అకౌంట్ కి బదిలీ చేస్తుంది.

లోన్ ఇవ్వడానికి పట్టే సమయం: తక్షణమే, నిమిషాల వ్యవధి లోనే లోన్ మన అకౌంట్ కి బదిలీ అవుతుంది.
లోన్ మొత్తం: మనకున్న అర్హతని బట్టి ₹8,౦౦౦ నుండి ₹5,00,౦౦౦ వరకు పొందవచ్చు.
ఇతర వివరాలు: చాలా సులభంగా లోన్స్ ని పొందవచ్చు; తక్కువ క్రెడిట్ స్కోర్‌లను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.


2. మనీ టాప్ – క్రెడిట్ లైన్ & లోన్ (MoneyTap – Credit Line & Loan):

10 లక్షల మందికి పైగా వినియోగదారులున్న.. బాల పార్థసారథి, అనూజ్ కాకర్, కునాల్ వర్మ పలు బ్యాంకులు, ఆర్థిక సంస్థల సహకారంతో ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా ₹5,00,000 వరకు లోన్ పొందవచ్చు. నెలకు కనీసం ₹30,000 జీతం తీసుకునే ఉద్యోగులు మాత్రమే ఈ యాప్ ద్వారా లోన్ పొందడానికి అర్హులు. తీసుకున్న మొత్తాన్ని రెండు నెలల నుంచి 3 సంవత్సరాల లోపు నెలవారి వాయిదాల్లో చెల్లించవచ్చు. మీ MoneyTap బ్యాలెన్స్ నుండి మీరు ఎంత మొత్తాన్ని విత్‌డ్రా చేసుకుంటారో, అంత మొత్తానికి మాత్రమే వడ్డీని చెల్లించవచ్చు. 3 నుండి 36 నెలల వరకు కాల వ్యవధి ఉంటుంది. వడ్డీ రేట్లు సంవత్సరానికి 12% నుండి ప్రారంభమవుతాయి.

లోన్ ఇవ్వడానికి పట్టే సమయం: చాలా మంది వినియోగదారులకు అదే రోజు లోన్ అప్రూవల్ వస్తుంది.
లోన్ మొత్తం: మనకున్న అర్హతని బట్టి ₹3,౦౦౦ నుండి ₹5,00,౦౦౦ వరకు పొందవచ్చు.
ఇతర వివరాలు: చాలా సులభంగా లోన్స్ ని పొందవచ్చు; తక్కువ క్రెడిట్ స్కోర్‌లను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.


3. క్యాష్ e (CASHe):

10 వేల కోట్లకి పైగా లోన్స్ ఇచ్చిన ఈ యాప్ ద్వారా చాలా సులభంగా మీ అత్యవసర పనులకు లోన్ (Easy Personal Loan) పొందవచ్చు. ఉద్యోగస్తులు మరియు సొంత వ్యాపారం చేసుకునే వారు కూడా ఈ యాప్ ద్వారా లోన్ తీసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా ₹1౦౦౦ నుండి ₹4,00,౦౦౦ వరకు మీకున్న అర్హతలని బట్టి లోన్ వస్తుంది. 90 రోజుల నుండి 540 రోజుల వరకు కాల వ్యవధి ఉంటుంది.

లోన్ ఇవ్వడానికి పట్టే సమయం: KYC పూర్తిచేసుకున్న వినియోగదారులకు తక్షణమే లోన్ అప్రూవల్ వస్తుంది.
లోన్ మొత్తం: మనకున్న అర్హతని బట్టి ₹1౦౦౦ నుండి ₹4,00,౦౦౦ వరకు పొందవచ్చు.
ఇతర వివరాలు: చాలా సులభంగా లోన్స్ ని పొందవచ్చు; తక్కువ క్రెడిట్ స్కోర్‌లను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.


4. క్రెడిట్ బీ (KreditBee)

Top 16 Low Credit Score Loan Apps in India లో ఇంకొక అత్యుత్తమ యాప్ లలో ఒకటి అయిన KreditBee తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి త్వరితగతిన వ్యక్తిగత రుణాల (Personal Loans)ను అందిస్తుంది. అత్యవసరంగా చిన్న చిన్న లోన్స్ అవసరమయ్యే వారికి ఇది సరైన ఎంపిక. 50 లక్షల మందికి పైగా వినియోగదారులున్న..ఈ యాప్ ద్వారా ఇప్పటికి 62 వేల కోట్ల లోన్స్ ని ఇచ్చింది. ఈ యాప్ ద్వారా ₹1000 నుండి ₹5,00,000 వరకు లోన్ పొందవచ్చు. ఉద్యోగస్తులు మరియు సొంత వ్యాపారం చేసుకునే వారు కూడా ఈ యాప్ నుండి లోన్ తీసుకోవచ్చు. తీసుకున్న మొత్తాన్ని 3 నెలల నుంచి 3 సంవత్సరాల లోపు నెలవారి వాయిదాల్లో చెల్లించవచ్చు.

లోన్ ఇవ్వడానికి పట్టే సమయం: తక్షణమే…గంటల వ్యవధి లోనే లోన్ మంజూరు చేయబడుతుంది.
లోన్ మొత్తం: మనకున్న అర్హతని బట్టి ₹1౦౦౦ నుండి ₹5,00,౦౦౦ వరకు పొందవచ్చు.
ఇతర వివరాలు: చాలా సులభంగా లోన్స్ ని పొందవచ్చు; తక్కువ క్రెడిట్ స్కోర్‌లను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.


5. పేసెన్స్ (PaySense):

Top 16 Low Credit Score Loan Apps in ఇండియా లో ఇంకొక యాప్ PaySense. దీనిని 2015లో ఒక వెంచర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టార్ట్‌ అప్ గా, ముంబై లో స్థాపించారు. 10 లక్షలకి పైగా వినియోగదారులున్న ఈ యాప్ నుండి 5 వేల నుండి 5 లక్షల వరకు లోన్ (Personal Loans) పొందొచ్చు. ఇది జీతం పొందే వారికి, వ్యాపారస్థులకు కూడా వ్యక్తిగత రుణాలు అందిస్తుంది. పేపర్‌లెస్ డాక్యుమెంటేషన్ విధానాన్ని అనుసరిస్తుంది. PaySense యాప్ ను ఉపయోగించడానికి KYC పత్రాలను అప్‌లోడ్ చేసి, ఋణ దరఖాస్తు పై డిజిటల్‌గా సంతకం చేయాలి.

లోన్ ఇవ్వడానికి పట్టే సమయం: 24 గంటల వ్యవధి లోనే లోన్ మంజూరు చేయబడుతుంది.
లోన్ మొత్తం: మనకున్న అర్హతని బట్టి ₹5౦౦౦ నుండి ₹5,00,౦౦౦ వరకు పొందవచ్చు.
ఇతర వివరాలు: చాలా సులభంగా లోన్స్ ని పొందవచ్చు. జీరో క్రెడిట్ హిస్టరీ ఉన్న వాళ్ళకి కూడా లోన్ ఇస్తుంది.


6. ధని (Dhani):

ప్రముఖ సంస్థ అయిన Indiabulls Consumer Finance Limited, తన పేరుని Dhani Loans and Services Limited గా మార్చుకుని చాలా సులభ పద్ధతులలో లోన్స్ ని ఇస్తుంది. ఈ యాప్ నుండి ₹1000 ల నుండి ₹15 లక్షల వరకు ఋణాలని తీసుకొనవచ్చు. వడ్డీ రేట్లు సంవత్సరానికి 13.99% నుండి ప్రారంభమవుతాయి. 3 నెలల నుండి 2 సంవత్సరాలకు లోపులో ఈ ఋణాలని వాయిదాల రూపం లో తిరిగి చెల్లించాలి.

లోన్ ఇవ్వడానికి పట్టే సమయం: కొద్ది గంటలలోనే లోన్ పొందొచ్చు.
లోన్ మొత్తం: మనకున్న అర్హతని బట్టి ₹1౦౦౦ నుండి ₹5,00,౦౦౦ వరకు పొందవచ్చు.
ఇతర వివరాలు: నిర్దిష్టమైన క్రెడిట్ స్కోరు అవసరం లేదు.


7. నీరా (Nira):

Nira, క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉండి లేదా ఎటువంటి క్రెడిట్ స్కోర్ లేని వ్యక్తులకు తక్షణమే లోన్స్ ఇస్తుంది. క్రెడిట్ చరిత్ర కంటే ఆదాయ స్థిరత్వంపై ఎక్కువ దృష్టి పెట్టిన Nira, అత్యవసర ఆర్థిక అవసరాల నిమిత్తం తక్షణ ఋణాలను అందిస్తుంది. ఈ యాప్ వినియోగదారులకు అనుకూలంగా ఉండి, తక్షణ నిర్ణయాలను తీసుకోవడం ద్వారా వేగంగా మరియు సులభమైన ఫైనాన్సింగ్ పరిష్కారాలను అందిస్తుంది.

లోన్ ఇవ్వడానికి పట్టే సమయం: అర్హత కలిగిన వారికి తక్షణమే అనుమతి.
లోన్ మొత్తం: మనకున్న అర్హతని బట్టి ₹5,000 – ₹1,00,000 వరకు పొందవచ్చు.
ఇతర వివరాలు: కనీస క్రెడిట్ స్కోర్ అవసరం లేదు.


8. రూపీ రెడీ (RupeeRedee)

Rupee Redee అనేది తక్షణ అవసరాల కోసం స్వల్ప కాల ఋణాలను అందించే యాప్. దీని ప్రత్యేకత ఏమిటంటే, చాలా తక్కువ పత్రాలు అవసరం అవుతాయి. ఇది లోన్ ఇవ్వడానికి క్రెడిట్ స్కోర్ (Credit Score) పైనే ఆధారపడకుండా ఇతర ఆర్థిక అంశాలను కూడా పరిగణన లోకి తీసుకుంటుంది. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నవారు లేదా అసలు క్రెడిట్ స్కోర్ లేని వారు కూడా ఈ లోన్స్ కి అర్హులు కావచ్చు. ఉద్యోగస్తులు మరియు సొంత వ్యాపారం చేసుకునే వారు కూడా ఈ యాప్ ద్వారా లోన్ తీసుకోవచ్చు. తీసుకున్న మొత్తాన్ని 12 నెలల లోపు చెల్లించాలి. వడ్డీ రేట్లు సంవత్సరానికి 30% నుండి ప్రారంభమవుతాయి.

లోన్ ఇవ్వడానికి పట్టే సమయం: అర్హత కలిగిన వారికి తక్షణమే అనుమతి.
లోన్ మొత్తం: మనకున్న అర్హతని బట్టి ₹2,000 – ₹1,49,000 వరకు పొందవచ్చు.
ఇతర వివరాలు: క్రెడిట్ స్కోర్ కాకుండా, ఆర్థిక స్థిరత్వం, ఆదాయ వనరులు, మరియు ఇతర వ్యక్తిగత వివరాలను కూడా పరిగణించడంతో, క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్న వారు కూడా రుణాన్ని సులభంగా పొందవచ్చు.


9. ఓలివ్ – Olyv (SmartCoin):

Olyv అనేది వ్యక్తిగత రుణాల కోసం ఏర్పాటు చేసిన ఒక సౌలభ్యవంతమైన ప్లాట్‌ఫామ్. ఇది ప్రత్యేకంగా మీ ఆదాయ స్థాయిని మరియు ఉద్యోగ స్థితిని పరిగణన లోకి తీసుకుంటుంది. ఇది తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న వ్యక్తులకు తక్షణ ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఈ యాప్ నుండి ₹1,000 నుండి ₹2,00,౦౦౦ వరకు లోన్స్ ని పొందొచ్చు. తీసుకున్న లోన్స్ ని 2 నెలల నుండి 24 నెలల లోపు తిరిగి చెల్లించాలి. వడ్డీ రేట్లు సంవత్సరానికి 18% – 30% మధ్యలో తగ్గుతున్న బ్యాలెన్స్‌పై విధిస్తారు.

లోన్ ఇవ్వడానికి పట్టే సమయం: అర్హత కలిగిన వారికి తక్షణమే అనుమతి.
లోన్ మొత్తం: మనకున్న అర్హతని బట్టి ₹1,000 – ₹2,00,000 వరకు పొందవచ్చు.
ఇతర వివరాలు: క్రెడిట్ స్కోరు అవసరం లేదు.


10. mపోకెట్ (mPokket):

mPokket అనేది ప్రధానంగా విద్యార్థులు మరియు యువ ప్రొఫెషనల్స్ కోసం రూపొందించిన లోన్ యాప్. వీరి కోసం క్రెడిట్ చరిత్ర అవసరం లేకుండా, తక్కువ మొత్తంలో తక్షణ రుణం అందించే సౌకర్యాన్ని కల్పిస్తుంది. విద్యార్థులకేమీ క్రెడిట్ స్కోర్ అవసరం లేకుండా, వారి విద్యాసంస్థ వివరాలు మరియు బ్యాంక్ ఖాతా ఆధారంగా లోన్ మంజూరు చేయబడుతుంది. వేతన ఉద్యోగులు కూడా తక్కువ క్రెడిట్ స్కోర్ తో లోన్ పొందవచ్చు. ఈ యాప్ ద్వారా గరిష్టంగా ₹45,000 వరకు లోన్ పొందొచ్చు.

లోన్ ఇవ్వడానికి పట్టే సమయం: విద్యార్థులు మరియు వేతన ఉద్యోగులకు తక్షణ అనుమతి.
లోన్ మొత్తం: అర్హతని బట్టి ₹500 – ₹45,000 వరకు పొందవచ్చు.
ఇతర వివరాలు: విద్యార్థులకు క్రెడిట్ స్కోర్ అవసరం లేదు; వేతన ఉద్యోగులకు తక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే సరిపోతుంది.


11. బజాజ్ ఫిన్‌సర్వ్ (Bajaj Finserv)

Bajaj Finserv అనేది భారతదేశంలో ప్రముఖ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC). ఇది వివిధ రకాల ఆర్థిక సేవలను అందిస్తుంది. 50 కోట్ల మందికి పైగా వినియోగదారులున్న..ఈ కంపెనీ నుండి ₹20,000 నుండి ₹11,00,000 వరకు లోన్ పొందవచ్చు. ఉద్యోగస్తులు మరియు సొంత వ్యాపారం చేసుకునే వారు కూడా లోన్ తీసుకోవచ్చు. తీసుకున్న మొత్తాన్ని 12 నెలల నుంచి 63 నెలల లోపు నెలవారి వాయిదాల్లో చెల్లించవచ్చు. వడ్డీ రేట్లు సంవత్సరానికి 13% నుండి 32% మధ్యలో ఉంటాయి.

లోన్ ఇవ్వడానికి పట్టే సమయం: ౩౦ నిమిషాలలోనే లోన్ శాంక్షన్.
లోన్ మొత్తం: అర్హతని బట్టి ₹20,000 – ₹11,00,000 వరకు పొందవచ్చు.
ఇతర వివరాలు: తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నవారు సహ సంతకదార్లు లేదా గ్యారంటీ ద్వారా రుణం పొందే అవకాశం ఉంది.


12. లేజి పే (LazyPay):

500 కోట్లకి పైగా లోన్స్ ఇచ్చిన ఈ LazyPay యాప్ ద్వారా చాలా సులభంగా మీ అత్యవసర పనులకు లోన్ (Easy Personal Loan) పొందవచ్చు. ఉద్యోగస్తులు మరియు సొంత వ్యాపారం చేసుకునే వారు కూడా ఈ యాప్ ద్వారా లోన్ తీసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా ₹10,000 నుండి వరకు ₹5,00,000 మీకున్న అర్హతలని బట్టి Xpress Loan వస్తుంది. వడ్డీ రేట్లు సంవత్సరానికి 18% నుండి ప్రారంభమవుతాయి. తీసుకున్న మొత్తాన్ని 3 నెలల నుంచి 2 సంవత్సరాల లోపు నెలవారి వాయిదాల్లో చెల్లించవచ్చు.

లోన్ ఇవ్వడానికి పట్టే సమయం: అనుమతి పొందడం చాలా వేగంగా జరుగుతుంది; సాధారణంగా 5 నిమిషాల్లోనే మీ దరఖాస్తును పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు.
లోన్ మొత్తం: అర్హతని బట్టి ₹10,000 – ₹5,00,000 వరకు పొందవచ్చు.
ఇతర వివరాలు: Xpress Loan కోసం దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్లైన్ లోనే జరుగుతుంది. ఇది సమయాన్ని ఆదా చేస్తుంది.


13. ట్రూ బాలన్స్ (TrueBalance):

TrueBalance, 30 లక్షల మందికి పైగా వినియోగదారులున్న..ఈ యాప్ ద్వారా ఇప్పటికి 7 వేల కోట్ల లోన్స్ ని ఇచ్చింది. తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి త్వరితగతిన వ్యక్తిగత రుణాల (Personal Loans)ను అందిస్తుంది. ఈ యాప్ ద్వారా ₹5,000 నుండి ₹1,25,000 వరకు లోన్ పొందవచ్చు. ఉద్యోగస్తులు మరియు సొంత వ్యాపారం చేసుకునే వారు కూడా ఈ యాప్ నుండి లోన్ తీసుకోవచ్చు. తీసుకున్న మొత్తాన్ని 3 నెలల నుంచి 12 నెలల లోపు నెలవారి వాయిదాల్లో చెల్లించవచ్చు.

లోన్ ఇవ్వడానికి పట్టే సమయం: తక్షణం, అదే రోజున లోన్ ని పొందవచ్చు.
లోన్ మొత్తం: అర్హతని బట్టి ₹5,000 – ₹1,25,000 వరకు పొందవచ్చు.
ఇతర వివరాలు: మీ మొబైల్ డేటా మరియు వినియోగాన్ని పరిగణలోకి తీసుకుని, మీ రుణానికి అనువైన అర్హతను నిర్ధారిస్తుంది.


14. స్టాష్‌ఫిన్ (StashFin):

StashFin, Akara Capital Advisors Private Limited ద్వారా స్థాపించబడిన నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC). స్టాష్‌ఫిన్ అనేది ఆదాయం మరియు ఉద్యోగ స్థితిని ఆధారంగా ప్రత్యేకమైన క్రెడిట్ లైన్ లోన్స్ ని యిస్తుంది. ఇది తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న వ్యక్తులకు అత్యంత అనుకూలమైన ఎంపికగా చెప్పవచ్చు. ఈ యాప్ ద్వారా గరిష్టంగా ₹5,00,000 వరకు లోన్ పొందవచ్చు. StashFin ద్వారా లోన్ తీసుకుని, 30 రోజులలోపు మీ లోన్ ని తిరిగి చెల్లిస్తే, ఆ లోన్ పైన ఏ విధమైన వడ్డీ లేకుండా ఉంటుంది. అంటే వినియోగదారులు 30 రోజులకు వరకు వడ్డీ రహిత క్రెడిట్ పీరియడ్‌ను ఆస్వాదించవచ్చు.

లోన్ ఇవ్వడానికి పట్టే సమయం: 24 గంటల లోపు మీ దరఖాస్తు సమీక్షించబడుతుంది, తద్వారా మీరు త్వరగా లోన్ ని పొందవచ్చు.
లోన్ మొత్తం: అర్హతని బట్టి ₹1,000 – ₹5,00,000 వరకు పొందవచ్చు.
ఇతర వివరాలు: క్రెడిట్ అర్హతను నిర్ధారించడంలో, ఆదాయ స్థాయి మరియు ఉద్యోగ స్థితిని ప్రధానంగా పరిగణలోకి తీసుకుంటుంది, కాబట్టి తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న వారు కూడా ఈ రుణానికి అర్హత పొందవచ్చు.


15. ఫ్లెక్స్ శాలరీ (FlexSalary):

FlexSalary, చిరు ఉద్యోగులకు తక్షణ వ్యక్తిగత లోన్స్ ని యిస్తుంది. దీని ద్వారా అర్హతని బట్టి ₹3 లక్షల వరకు లోన్ ని పొందవచ్చు. FlexSalary ఋణ సేవలను Vivifi India Finance Pvt. Ltd (N-09.00447), RBI లో నమోదు చేయబడిన నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ.

లోన్ ఇవ్వడానికి పట్టే సమయం: KYC పూర్తి చేసిన వినియోగదారులకు తక్షణమే ఋణ సదుపాయం.
లోన్ మొత్తం: అర్హతలని ₹4,000 నుండి ₹3,00,000 వరకు లోన్ తీసుకోవచ్చు.
ఇతర వివరాలు: నెల వారీ జీతం ఆధారంగా నిర్ణయం.


16. క్రెడీ (Credy):

Credy  అనేది తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న వ్యక్తులకు సులభంగా లోన్స్ అందించే విశ్వసనీయ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్. తక్షణ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి వేగంగా మరియు సరళంగా డిజైన్ చేయబడిన ఈ ప్లాట్‌ఫారమ్, కేవలం క్రెడిట్ స్కోర్‌పైనే ఆధారపడకుండా ఇతర ప్రత్యామ్నాయ సమాచారం ఆధారంగా కూడా రుణ అర్హతను నిర్ణయిస్తుంది.

లోన్ ఇవ్వడానికి పట్టే సమయం: క్రెడీ అనుమతి ప్రక్రియ చాలా వేగంగా ఉంటుంది. KYC పూర్తి చేసిన వినియోగదారులకు గంటల వ్యవధిలోనే రుణం మంజూరు చేయబడుతుంది.
లోన్ మొత్తం: అర్హతని బట్టి ₹10,000 – ₹1,00,000 వరకు పొందవచ్చు.
ఇతర వివరాలు: తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నవారు లేదా క్రెడిట్ చరిత్ర తక్కువగా ఉన్నవారు కూడా ఈ రుణానికి అర్హత పొందవచ్చు.


How to Apply for a Personal Loan When Your Credit Score is Low? తక్కువ లేదా బాడ్ క్రెడిట్ స్కోర్‌ ఉన్నప్పుడు వ్యక్తిగత ఋణం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి? 

తక్కువ లేదా బాడ్ క్రెడిట్ స్కోర్‌ ఉన్నప్పుడు Personal Loan కోసం ఈ క్రింద చెప్పిన విధంగా దరఖాస్తు చేసుకోవాలి.

1. సరైన రుణ యాప్‌ను ఎంచుకోండి:

తక్కువ క్రెడిట్ ఉన్న వ్యక్తులకు రుణాలను అందించే టాప్ లోన్ యాప్స్‌లో (Top 16 Low Credit Score Loan Apps in India) ఒకదానిని ఇన్‌స్టాల్ చేయండి. ఉదాహరణకు EarlySalary, MoneyTap, CASHe, KreditBee, లేదా LazyPay వంటి ఈ యాప్స్ ద్వారా Personal Loan కోసం అప్లై చేయండి. ఇవి మీ క్రెడిట్ స్కోర్ (Credit Score / CIBIL Score) కంటే ఎక్కువగా మీ ఉద్యోగం మరియు ఆదాయం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటాయి.

2. మీ వివరాలను నమోదు చేయండి:

Top 16 Low Credit Score Loan Apps in India లోని, ఏదొక యాప్ ని ఎంచుకున్న తర్వాత, దానిలో మీ పేరు, ఫోన్ నంబర్, మరియు ఇమెయిల్ చిరునామా వంటి ప్రాథమిక సమాచారాన్ని నమోదు చేయండి.

3. KYC ధృవీకరణను పూర్తి చేయండి:

చాలా యాప్స్ మీ PAN కార్డ్ మరియు ఆధార్‌తో KYC ధృవీకరణను అడుగుతాయి. మీ గుర్తింపును మరియు ఆదాయాన్ని ధృవీకరించడానికి KYC వెరిఫికేషన్ ని పూర్తి చేయండి.

4. మీ బ్యాంక్ ఖాతాను లింక్ చేయండి:

నిధులను విడుదల చేయడం మరియు ఖాతా ధృవీకరణ కోసం మీ బ్యాంక్ ఖాతా వివరాలను యాప్‌కు జోడించండి. ఇది మీ ఋణ అర్హత (Credit Score)ను విశ్లేషించడానికి కూడా యాప్‌కు సహాయపడుతుంది.

5. వ్యక్తిగత లోన్ ఆఫర్లను తెలుసుకోండి:

మీ బ్యాంకింగ్ చరిత్ర మరియు ఇతర ప్రమాణాల ఆధారంగా, యాప్ మీ ప్రొఫైలుకు అనుగుణమైన లోన్ (Personal Loan) ఆఫర్లను సేకరించుకుంటుంది. ఈ ఆఫర్లు మీ ఆర్థిక స్థితిపై ఆధారపడి ఉంటాయి, కాబట్టి ఇవి లోన్ మొత్తాలు, వడ్డీ రేట్లు, మరియు షరతులలో విభిన్నంగా ఉంటాయి.

6. సరైన లోన్ ఆఫర్‌ను ఎంచుకోండి:

అందుబాటులో ఉన్న లోన్ ఆఫర్లను పోల్చి, మీ అవసరాలకు బాగా సరిపోయే ఒకదానిని ఎంచుకోండి. లోన్ యొక్క వడ్డీ రేటు, తిరిగి చెల్లించు కాలం, మరియు ఏదైనా అదనపు ఫీజులపై దృష్టి పెట్టండి.

7. లోన్ యొక్క నిబంధనలు మరియు షరతులను సమీక్షించి అంగీకరించండి:

లోన్ తీసుకునే ముందు అన్ని నిబంధనలు మరియు షరతులను బాగా చదివి అర్ధం చేసుకోండి. మీకు అంగీకారం అయిన తర్వాత, మీ దరఖాస్తును సమర్పించండి.

8. లోన్ అనుమతి కోసం ఎదురుచూడండి:

ఈ యాప్స్ చాలా వేగంగా అనుమతులు ఇస్తాయి. కొన్ని అనుమతుల తర్వాత వెంటనే లోన్ అమౌంట్ ని మీకు బదిలీ చేస్తాయి.

ఈ దశలను అనుసరించడం ద్వారా, మీరు తక్కువ లేదా బాడ్ క్రెడిట్ స్కోర్‌ ఉన్నా సులభంగా లోన్స్ ని పొందొచ్చు.


సిబిల్ స్కోర్ తక్కువ గా ఉండటం వల్ల ఉన్న లాభ నష్టాలు (Pros and Cons of No CIBIL Score Loans)

సిబిల్ స్కోర్ తక్కువ గా ఉండటం వల్ల ఉన్న లాభ నష్టాలను మనం ఇప్పుడు తెలుసుకుందాము.

తక్కువ క్రెడిట్ స్కోర్ యొక్క లాభాలు (Pros of Low Credit Score Loans)

1. త్వరిత మరియు సులభమైన దరఖాస్తు ప్రక్రియ:

నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCs) మరియు లోన్స్ యాప్స్ సులభమైన, ఆటోమేటెడ్ దరఖాస్తు ప్రక్రియలను అందిస్తాయి. ఈ యాప్స్ ద్వారా తక్కువ పేపర్ వర్క్‌తోనే లోన్స్ కోసం దరఖాస్తు చేయవచ్చు.

2. త్వరితగతిన లోన్ అమౌంట్ విడుదల:

అనేక లోన్ యాప్స్ నిమిషాలు లేదా గంటల్లోనే మనం అప్లికేషన్ ని ఆమోదించి విడుదల చేయగలవు. అవి మన అత్యవసర లేదా తక్షణ ఆర్థిక అవసరాలకు అనువైనవి.

3. అనుకూలమైన అర్హత ప్రమాణాలు:

సిబిల్ స్కోర్ అవసరం లేని లోన్స్, ఉద్యోగం, నెలవారీ ఆదాయం, మరియు ఖర్చుల విధానాలను పరిగణనలోకి తీసుకుంటాయి. ఇది తక్కువ లేదా క్రెడిట్ చరిత్ర లేని వారికి కూడా రుణాన్ని సులభంగా అందిస్తుంది.

4. ప్రత్యామ్నాయ క్రెడిట్ స్కోరింగ్:

సిబిల్ స్కోర్ (CIBIL Score) కంటే ఆదాయం మరియు ఉద్యోగంపై ఆధారపడే డేటాతో, లోన్ యాప్స్ యువ ప్రొఫెషనల్స్, విద్యార్థులు లేదా కొత్త గా లోన్స్ తీసుకునే వారికీ ఒక మంచి మార్గాన్ని చూపిస్తాయి.


తక్కువ క్రెడిట్ స్కోర్ యొక్క నష్టాలు (Cons of Low Credit Score Loans)

1. అధిక వడ్డీ రేట్లు:

ఈ లోన్స్ సిబిల్ స్కోర్‌పై ఆధారపడకపోవడం వల్ల, లోన్స్ ఇచ్చే సంస్థలు సాధారణంగా అధిక వడ్డీ రేట్లను విధిస్తాయి. ఇది లోన్స్ తీసుకునే వారికి అదనపు చెల్లింపు భారం పడుతుంది.

2. జామిన్ అవసరం ఉండే అవకాశం:

కొన్ని NBFCలు పెద్ద మొత్తాల లోన్స్ కు జామిన్‌ను (Collateral) అడగవచ్చు. లోన్ తీసుకున్న వారు డిఫాల్ట్ అయితే, వారి ఆస్తులు, వాహనాలు లేదా బంగారం వంటి విలువైన వస్తువులు కోల్పోయే ప్రమాదం ఉంది.

3. తక్కువ చెల్లింపు గడువు:

సిబిల్ స్కోర్ అవసరం లేని లోన్స్ సాధారణంగా తక్కువ కాలంలో తిరిగి చెల్లించడానికి రూపొందించబడ్డాయి. అందువల్ల ఋణ గడువు చాలా తక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువ EMI లు మరియు త్వరగా చెల్లించాల్సి ఉంటుంది. కనుక ఇది ఒత్తిడికి దారితీస్తుంది.

4. అదనపు ఫీజులు మరియు చార్జీలు:

అనేక లోన్స్ యాప్స్ ప్రాసెసింగ్ ఫీజులు, ఆలస్యంగా చెల్లిస్తే పెనాల్టీలు మరియు ముందస్తు చెల్లింపు జరిమానాలు వసూలు చేస్తాయి, ఇవి మొత్తం ఋణ ఖర్చును పెంచుతాయి. కనుక లోన్స్ తీసుకునే ముందే షరతులను జాగ్రత్తగా సమీక్షించాలి.


లోన్ ఆమోదం పొందడానికి ముఖ్యమైన చిట్కాలు (Final Tips for Loan Approval Success):

1. మీకున్న అర్హతలను (Eligibility Requirements)ను తనిఖీ చేయండి:

ముందుగా లోన్ కోసం మీరు ఎంచుకున్న యాప్ లో, మీకు అప్లై చేసుకోడానికి అర్హత ఉన్నదో లేదో చెక్ చేసుకోండి. ఇలా చేయడం వాళ్ళ మీ సమయం ఆదా అవుతుంది.

2. డాక్యుమెంటేషన్ సిద్ధంగా ఉంచుకోండి:

వేగవంతమైన ప్రాసెసింగ్ కోసం మీ PAN, ఆధార్, మరియు మీ ఆదాయానికి సంభందించిన ఆధారాలను సిద్ధంగా ఉంచుకోండి.

3. ఒకే సమయంలో పలు దరఖాస్తులను పరిమితం చేయండి:

ఒక క్షణంలో పలు రుణదాతలకు దరఖాస్తు చేయడం మీ క్రెడిట్ స్కోర్‌ను మరింత ప్రభావితం చేయవచ్చు.

4. సమయానికి తిరిగి చెల్లించండి:

తీసుకున్న లోన్ ని సమయానికి చెల్లింపులు చేయడం మీ క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. తద్వారా భవిష్యత్తు లో వేరే లోన్స్ కావాల్సి వచ్చినప్పుడు, తద్వారా సులభంగా అనుమతులను పొందవచ్చు.

ఈ లోన్స్ యాప్స్ ద్వారా, భారతదేశంలోని తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న వ్యక్తులకు త్వరగా మరియు భద్రతతో తమ ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు సులభంగా లోన్స్ పొందవచ్చు. మీ పరిస్థితికి సరిపడే లోన్ యాప్‌ను ఎంచుకొని, లోన్ తీసుకోండి. లోన్ తీసుకున్నాక, అంతే బాధ్యతాయుతంగా తిరిగి చెల్లించడం మరిచి పోకండి. తద్వారా మీ ఆర్థిక ప్రయాణం మరింత సజావుగా ఉంటుంది.


ముగింపు:

సిబిల్ స్కోర్ లేకుండా లేదా క్రెడిట్ చరిత్ర లేనివారికి డబ్బులు అత్యవసరంగా కావాల్సి వచ్చినప్పుడు ఈ యాప్స్ నుండి లోన్స్ తీసుకోవడం, ఒక సులభమైన మార్గంగా ఉంటుంది. కానీ, ఇవి అధిక ఆర్థిక వ్యయాలతో కూడి ఉంటాయి. వేగవంతమైన నగదు జమ మరియు సరళమైన దరఖాస్తు ప్రక్రియ ఉన్నప్పటికీ, అధిక వడ్డీ రేట్లు మరియు జామిన్ అవసరాలు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి, లోన్స్ తీసుకునే వారు తమ అత్యవసర ఆర్థిక అవసరాలను ఈ ఖర్చులతో సమన్వయం చేసుకోవడం అవసరం.

🔴Related Post